వాళ్లిద్దరూ ప్రధాని అయినా.. ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదు
వ్యవస్థ మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని, దానికి ప్రతిగా కేంద్రం ఇచ్చే రాయితీలను అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన, పోలీస్ వ్యవస్థ తీరును కేంద్రం గమనిస్తోందని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని, దానికి ఒక్క అంగుళం కూడా ఎవరూ కదిలించలేరని అన్నారు.













