అభివృద్ధికి ఆయన మారుపేరు : సుజనా
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం బాధాకరమని బీజేపీ నేత సుజనా చౌదరి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడెల గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువేనని అన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. అభివృద్ధికి ఆయన మారుపేరన్నారు. పట్టుబట్టి కోటప్పకొండను అభివృద్ధి చేశారని అన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని కోరుకునే వ్యక్తి కోడెల అని అన్నారు. మహిళా పార్లమెంటేరీయన్ నిర్వహించి దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారన్నారు. కోడెల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నానని సుజనా పేర్కొన్నారు.













