అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదు
అమరావతి నుంచి రాజధానిని తరలించటం ఎవరితరం కాదని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల పాదయాత్రకు బీజేపీ తరపున సంఫీుభావం తెలుపుతున్నామని చెప్పారు. అమరావతి రాజధాని ఒక్క అంగుళం కూడా కదలదన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను ఇబ్బందిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేసిన రాజధానిని ఎవరూ కదపలేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ రాజధానిని తరలించేందుకు చేసే ప్రయత్నాలను తాము అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఏ పార్టీ అయినా సభ్య సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని సూచించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు.













