పార్లమెంటులో చట్టం చేస్తేనే తప్ప.. మరే రూపంలోనూ కదిలించలేరు
ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం కుదరదని, సీఎం జగన్ తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని అమరావతిని కదిలించలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు అమరావతికి మద్దతు తెలిపి, ఇప్పుడు మూడు రాజధానులంటే ఎలాగని ప్రశ్నించారు. పార్లమెంటులో చట్టం చేస్తేనే తప్ప మరే రూపంలోనూ అమరావతిని కదలించలేరన్నది తన అభిప్రాయమన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు.













