లడ్డు టాపిక్ లో బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత ఎంట్రీ.. సుప్రీం కోర్ట్ లో పిల్..
తిరుమల లడ్డు ( Tirumala Laddu) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలుసు. అయితే ఈ పాపిలారిటీ లడ్డు టేస్ట్ గురించి కాదు.. అందులో కల్తీ జరిగింది అంటూ వస్తున్న ఆరోపణల గురించి. ఇక ఆ విషయం పక్కన పెడితే దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు (Tirumala Laddu) లోకల్ టీ జరిగింది అని కోట్లాదిమంది భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరో నేతలు ఈ విషయంపై తమ రేంజ్ లో స్పందిస్తున్నారు. పవన్ (Pawan Kalyan )అయితే ఏకంగా క్షమాపణ దీక్ష అంటూ హడావిడి చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ ఇష్యూలోకి బీజేపీ (BJP) ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్యస్వామి( Subramanya Swamy)ఎంట్రీ ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డు ( Srivari Laddu) ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu)చేసిన వ్యాఖ్యలపై ఆయన సుప్రీంకోర్టులో (Supreme court )ఆపిల్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని.. ఇలా చేయడం వల్ల ప్రజలలో అశాంతి చెలరేగుతుందని ఆయన ఆరోపించారు.
అంతేకాదు చంద్రబాబు (Chandra Babu)వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించడానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును స్వామి కోరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించడం తీవ్ర దుమారాన్ని సృష్టిస్తోంది. తిరుమల ప్రసాదం కలుషితమైందని.. తిరుమల ప్రసాదాలలో అపవిత్రమైన జంతు మాంసపు కొవ్వుతో(Animal Fat) తయారుచేసిన నీతిని ఉపయోగించారని చంద్రబాబు ఆరోపించారు. దీంతో ఒక్కసారి తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ షాక్ అయ్యారు.
అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కోట్లాదిమంది భక్తులలో ఆందోళన రేకెత్తించే విధంగా ఉన్నాయని సుబ్రమణ్య స్వామి ఆరోపిస్తున్నారు. అందుకే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని.. ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్వామి ఎంట్రీ ఇవ్వడం.. చంద్రబాబుకి విరుద్ధంగా కోర్టులో అపీలు చేయడంతో వైసిపి అనుకూల వర్గాలు ఈ వార్తలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి .













