AP Ministers: కర్ణాటకలో ఏపీ మంత్రుల అధ్యయనం
మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఆంధ్రప్రదేశ్ లోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటక (Karnataka)లో పర్యటించారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా అధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి(Ramprasad Reddy), అనిత(Anitha), సంధ్యారాణి (Sandhyarani )కలిశారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు. కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకుంది.













