ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అంబికా కృష్ణ
వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు కార్పొరేషన్ పదవి వరించింది. రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం ఆదివారం నియమించింది. స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా జేఆర్ పుష్పరాజ్, ఏపీ ఫిల్మ్ టెలివిజన్ అండ్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అంబికా కృష్ణను నియమించింది. అలాగే వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా జలీల్‌ఖాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఎండీ నౌమాన్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లును నియమించింది. అంతేగాక తుడా చైర్మన్‌గా జి. నర్సింహ యాదవ్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎరిక్సన్ బాబు, మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రకాశ్నాయుడును నియమించింది.













