అమరావతిలో రాజమౌళి పర్యటన
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకధీరుడు రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఆయన వెంట సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు ఉన్నారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాజమౌళి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధానిలో నిర్మించే అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో రాజమౌళి సహకారాన్ని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆకృతులపై చర్చించేందుకు రాజమౌళి అమరావతి వచ్చారు. ముఖ్యమంత్రితో దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన అమరావతిలో పర్యటించారు. ఈ పర్యటన అనంతరం మరోసారి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.













