నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎంఒయు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తాజా బోస్టన్ (యూఎస్ఏ)లో ఉన్న నార్త్ఈస్టర్న్ విశ్వవిద్యాలయంతో అనుసంధానం కుదుర్చుకుంది. రెండు విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రభావంతమైన విద్య, పరిశోధనలను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు వీలుగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు విశ్వవిద్యాలయాలు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేసాయి. విద్యా సంబంధ ప్రయోజనాలు, ఉన్నత భవిష్యత్తు వైపుకు విద్యార్థులు అడుగులు వేసేందుకు వీలుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన ఎంవోయూ కమిటీ పనిచేస్తోంది.
ప్రపంచంలోని అయిదు శాతం ఉత్తమ విశ్వవిద్యాలయా జాబితాలో ఉన్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీని ఎంపిక చేసుకుంది. దీని వల్ల ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు యూఎస్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించడం. అక్కడి పరిశోధనలను నేర్చుకోవడం నేరుగా అభ్యసనం చేసుకోవడం వీలవుతుందన్నారు. ఈ ఎంవోయూ వల్ల ఇప్పటికే కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో భాగస్వామ్యం ఏర్పడింది. ముందు, ముందు ఇతర విభాగాల్లోను ఈ భాగస్వామ్యం అందుబాటులోకి వస్తుంది.













