శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్లెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవి.ధర్మారెడ్డి తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 27 నుంచచి అక్టోబర్ 5వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఈ నెల 20న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలో అంకుర్పారణ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27న సాయంత్రం 5:45 నుంచి 6:15 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణనం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ముఖ్యంగా అక్టోబర్ 1న గరుడ వాహనం, అక్టోబర్ 2న స్వర్ణరథ, అక్టోబర్ 5న చక్రస్నానం జరగనున్నాయి.













