ఆగస్టు 3 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ఆగస్టు 3 నుంచి 5 వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గదుల కేటాయింపులో నూతన విధానం వల్ల భక్తుల ఇబ్బందుల తొలగిపోయాయన్నారు. నడకదారి టోకెన్లలో టైం స్లాట్ విధానంతో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. భక్తులు గంటలోనే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్లలో తెచ్చిన మార్పుల వల్ల తోపులాటలు లేకుండా భక్తులు శ్రీవారి దర్శించుకుంటున్నారని తెలిపారు. ఆగస్టు 2వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు అన్ని అర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.













