10 నుంచి శ్రీవారి బ్రహ్మూెత్సవాలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మూెత్సవాలు ఈ నెల 10 నుంచి 18 వరకు జరగనున్నాయి. 9న ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. చాంద్రమానం ప్రకారం మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఆ సంవత్సరం భాద్రపదంలో వార్షిక బ్రహ్మూెత్సవాలు, దసరా సమయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. రెండోసారి జరిగే నవరాత్రి ఉత్సవాల్లో ధ్వజారోహణం, సీఎం పట్టువస్త్రాల సమర్పణ, స్నపన తిరుమంజనం, మహారథోత్సవం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఉత్సవాల్లో మాత్రమే నిర్వహించే పుష్పక విమాన వాహనసేవను ఈ నెల 15న నిర్వహిస్తారు. 14న గరుడసేవ, 17న స్వర్ణ రథోత్సవం, 18న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి.













