శ్రీశైలంలో వారంపాటు దర్శనాలు బంద్
శ్రీశైల మహాక్షేత్రంలో కరోనా వ్యాపిస్తున్నది. రెండ్రోజులుగా నిర్వహించిన పరీక్షల్లో తొలిసారి 13 మందితో పాటు మంగళవారం మరో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇద్దరు పరిచారికలు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్థానికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు వారంపాటు నిలిపివేస్తున్నట్టు ఈవో కేఎస్ రామరావు ప్రకటించారు. ఆలయ వసతి గదుల్లో ఉండే భక్తులతో పాటు యాత్రికులు స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.













