ప్రవాసాంధ్రులను సత్కరించిన శ్రీ మాతా కళా పీఠం
విశాఖపట్నం ద్వారకానగర్ లో ఉన్న శ్రీ మాతా కళాపీఠం ఆద్వర్యంలో శ్రీ మాతా కళాపీఠం రథసారదులు శ్రీ బిన్నాల నర్శంహమూర్తి గారు శ్రీ పల్లి నాగభూషణరావుగారు మరియు శ్రీమాతా కళాపీఠం గౌరవ అధ్యక్షులు శ్రీ వెంకన్నచౌదరి గారు మన ఉత్తరాంధ్ర నుండి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడిన ప్రవాసాంధ్రులయిన శ్రీ గేదెల దామోదర్ గారికి శ్రీమతి కొండపు సుధారాణి గారికి ఆత్మీయ సన్మానం చేసారు.
గత సంవత్సరం నాట్స్ వారి ఆధ్వర్యంలో అమెరికా లో జరిగిన తెలుగు సంబరాలలో నుండి శ్రీ మాతా కళాపీఠం నుండి BVN మూర్తి గారు P నాగభూషణం రావు గారు ఉత్తరాంధ్ర కళారంగాలైన పద్య, నాటక, జానపద, కళాకారులను అమెరికా తీసుకువెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ యడ్ల గోపాలం మొదలుకొని యాచక వృత్తిలో బ్రతుకీడుస్తున్న జముకు వాయిద్యకారుడు శ్రీ బోని అసరయ్య వరకు పందొమ్మిది మంది కళాకారులను తీసుకు వెళ్ళారు. అమెరికా లో కార్యక్రమం అనంతరం వీరందరికీ చక్కనైన ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా అమెరికాలో ఉన్నన్నాళ్ళు ఈ కళాబృందానికి సకల సౌకర్యాలు అందచేసి తెలుగువారి పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్న శ్రీ గేదెల దామోదర్ గారిని మరియు శ్రీమతి కొండపు సుధారాణి గారిని నిరంతరం స్మరించుకుంటు ఉంటారు. శ్రీ మాతా కళాపీఠం వారు ఈ ఇరువురు ప్రవాసాంధ్రులు విశాఖపట్నం వచ్చిన సందర్భంలో తేది 01/03/2024 శ్రీ మాతా కళాపీఠం లో సన్మానకార్యక్రమం వేడుకగా నిర్వహించారు.
కార్యక్రమానికి GVMC విశాఖపట్నం సెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్ కార్యదర్శి అయిన గౌరవ నీయులు పల్లి నల్లనయ్య గారు అధ్యక్షత వహించగా ఆత్మీయ అతిథిగా ఐడల్ గంధర్వ వ్యవస్థాపకులు, స్వరసమ్రాట్ డాక్టర్ శ్రీ టి శరత్ చంద్ర గారు పాల్గొన్నారు.
గానద్వయం చైతన్య బ్రదర్స్, ప్రముఖ జానపద గాయకుడు జానకిరామ్, శీరపు శ్రీనివాస్, శ్రీ శర్మ గారు HPCL K.V.V.S.రెడ్డి, పద్మావతి దంపతులు మరియు హాజరై తమ అభినందనలు తెలియజేసారు.
సినీ గేయ రచయితలు శ్రీమతి ప్రభాకరశర్మ గారు, శ్రీ దుర్గాప్రసాద్ ఐనాడ గారు ఈ కార్యక్రమంలో సన్మానపత్రాల అక్షరమాలలు అందచేసారు.
ఈ సందర్భంగా… మన ప్రవాసాంధ్రులయిన శ్రీమతి కొండపు సుధారాణి గారికి “కళాబాంధవి“, శ్రీ గేదెల దామోదర్ గారికి “కళాబాంధవ“ బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సంగీత విభావరిలో ప్రముఖ నేపధ్య గాయకులు మూల శ్రీలత, శ్రీ సూర్య కార్తిక్, చి. ధీరజ్, ప్రముఖ తబల కళాకారుడు శ్రీ బగ్గం ధనంజయ, కీ బోర్డు ప్లేయర్ శ్రీ హరి, పేడ్స్ ప్లేయర్ విజయ్ తమతమ గాన వాయిద్య మాధుర్యంతో అలరించారు.







