Kuna Ravikumar: వైసీపీ ఇకనైనా తీరు మార్చుకొని.. సరైన మార్గంలో : కూన రవికుమార్

నేరస్థుల అడ్డా వైసీపీ (YCP) అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ (Kuna Ravikumar) ఆరోపించారు. నకిలీ మద్యానికి మూలకేంద్రం జగనేనని విమర్శించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యాన్ని ప్రోత్సహించిందే జగన్ (Jagan). నకిలీ మద్యంపై దాడులు నిర్వహించాలని చెప్పింది చంద్రబాబు (Chandrababu) కదా? జగన్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నకిలీ మద్యం అమ్మే ఎవరినైనా వదిలిపెట్టేది లేదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇకనైనా తీరు మార్చుకొని సరైన మార్గంలో నడవాలని వైసీపీ నేతలకు చెబుతున్నాం అని అన్నారు.