ఎపి దేవాదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరికాల్ వలవన్
ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న కరికాల్ వలవన్ ఎపి దేవాదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ కు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో వైజాగ్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ ద్వారా దిగ్గజ కంపెనీలతోపాటు పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం పాఠకులకు విదితమే. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకురావడంతోపాటు రాష్ట్రానికి ఉపయోగపడేలా తన అనుభవాన్ని ఉపయోగిస్తున్న కరికాల్ వలవన్ ఇప్పుడు దేవాదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా దేవాలయాల పరిస్థితులను బాగు పరచడంతోపాటు, భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు ఇతరత్రా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేయనున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కరికాలవలన్కు తెలుగు టైమ్స్ ఎడిటర్, రాష్ట్ర దేవాదాయశాఖ టెంపుల్స్-ఎన్నారై విభాగం సలహాదారునిగా ఉన్న చెన్నూరి వెంకట సుబ్బారావు అభినందనలు తెలియజేశారు.













