వైభవంగా మల్లన్న రథోత్సవం
మల్లికార్జునుడు కొలువైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా సాగాయి. అదివారం సాయంత్రం జరిగిన భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి రథోత్సవంలో లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాత్రి ఉభయదేవాలయ ప్రాంగణలో భ్రమరాంబదేవికి రమావాణిసేవిత రాజరాజేశ్వరిదేవి అలంకార సేవలు జరిపారు. రథోత్సవంలో రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి నిర్వహించారు. తదుపరి ఉభయదేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక హారతి పూజలందుకున్న ఉత్సవమూర్తులను వెండిపల్లకిలో ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొని వచ్చారు. రథంపై అధిష్టింపజేసి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరికాయలను సమర్పించారు.













