సీబీఐ మాజీ జేడీ కోసమే నా రాజీనామా
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సాయం చేసేందుకు పదవికి రాజీనామా చేశానని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజగోపాల్ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో వీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన వర్సిటీకి వచ్చిన ఆయన తన హయాంలో జరిగిన పనులు రాజీనామాకు గల కారణాలను వివరించారు. జేడీతో కలిసి నడిచేందుకే తన పదవికీ రాజీనామా చేసినట్లు తెలిపారు. తన పదవీకాలంలో యూనివర్శిటీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చానని, ఈ మార్పులే రేపు వర్శిటీని అగ్రగామిగా నిలుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన పాలకమండలి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ వీఆర్ఎస్ తీసుకున్నారని, ఆయన ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశ్యంలో ఉన్నారని అన్నారు. లక్ష్మీనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియదన్నారు.













