“శ్రీ కోదండరామ ట్రస్ట్” చెన్నూరు ప్రారంభం
కృష్ణా జిల్లా, పెడన మండలం, చెన్నూరు గ్రామం లో దాదాపు 80 ఏళ్ల క్రితం నుంచి ఉన్న శ్రీకోదండ రామ దేవాలయం ను ఆ ఊరి పెద్దలు, హైదరాబాద్ లో ఉంటున్న స్వర్గీయ చెన్నూరి వెంకట సుబ్బా రావు గారి మనవళ్లు, మనవరాళ్లు, ఇతర బంధువులు కలిసి 5 సంవత్సరాల క్రితం పునర్మించారు.
అప్పటి నుంచి ఆ గుడి లో ప్రతి రోజు పూజలు, ధూప దీప నైవేద్యాలు యధావిధి గా జరుగుతూ, శ్రీరామ నవమి పండుగ రోజున ఘనం గా శ్రీ సీతా రామ కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి.
ఈ గుడిని ఇంకా అభివృద్ధి చెయ్యాలని, ఆ ఊరిలోనే ఒక కల్యాణ వేదిక కట్టాలని, మరిన్ని దైవ కార్య క్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశ్యం తో ఈ రోజు చెన్నూరు గ్రామ పెద్దలు, హైదరాబాద్ వాస్తవ్యులు కలిసి “శ్రీ కోదండ రామ ట్రస్ట్, చెన్నూరు” పేరున ఒక ట్రస్ట్ ని ప్రారంభించారు.
కృష్ణా జిల్లా, పెడన మండలం, కౌతారం గ్రామం లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఈ ట్రస్ట్ ప్రెసిడెంట్ గా శ్రీ చెన్నూరి వెంకట సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ పుప్పాల రవి కుమార్, మరో ముగ్గురు ట్రస్టీ లు గా ఈ ట్రస్ట్ ని ప్రారంభించారు.
ట్రస్ట్ చేపట్టే పనులు పూర్తిగా గుడి అభివృద్ధికి, చెన్నూరి గ్రామ సేవా కార్యక్రమాలకి ఉపయోగ పడేలా వుంటాయని, పూర్తి పారదర్శకతో వ్యవహరిస్తామని ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు.













