Sree Mukhi: బీచ్‌లో సూపర్ స్టైలిష్ గా శ్రీముఖి
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి(Sree Mukhi) ఇప్పుడు గ్లామర్ హద్దుల్ని చెరిపేసింది. బిగ్ బాస్ షో తో బాగా పాపులర్ అయిన శ్రీముఖి ఇప్పుడు పలు షో లకు యాంకర్ గా చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటుంది. దీంతో పాటూ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ బీచ్ లో బ్లాక్ కలర్ బీచ్ వేర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ ఫోటోల్లో శ్రీముఖి మోకాళ్ల వరకు స్కర్ట్ వేసుకుని, నెట్ మేస్ టాప్ తో తన లుక్ ను సూపర్ స్టైలిష్ గా మార్చేసింది. శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













