తిరుపతిలో అత్యాధునిక హంగులతో క్రీడా ప్రాంగణం తుడా చైర్మెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
తిరుపతిలో పలు అభివృద్ధి పనులపై తుడా చైర్మన్, టీటీడి బోర్డ్ సభ్యుడు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా పరిధిలో అభివృద్ది పనులను ప్రణాళిక బద్దంగా చేపట్టాలని తుడా చైర్మెన్ డాక్టర్ అధికారులకు సూచించారు. తుమ్మల గుంట కు వెళ్లే మార్గంలో ఉప్పరపల్లి సమీపంలోని తుడా స్థలంలో అత్యాధునిక హంగులతో కూడిన క్రీడా ప్రాంగణంను తీర్చిదిద్దాలని, రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నమూనా ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. క్రీడా ప్రాంగణం నిర్మాణ ప్రణాళికను ఈ సందర్భంగా అమోదించారు. తుడా కార్యాలయంలో భవిష్యత్తులో ఉద్యోగుల నియామక ద•ష్ట్యా విభాగాల వారీగా గదుల కేటాయింపు, ఆధునీకరణ పనులు చేపట్టాలన్నారు. అలాగే టీటీడీ ఇటీవల తుడాకు అప్పగించిన డివైడర్ల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తుడా కు చెందిన అద్దె గదులు, ప్లాట్లు, స్థలాలు, పార్కుల వివరాలతో కూడిన జాబితా సిద్దం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తుడా భూసేకరణ విభాగం అధికారి శ్రీనివాసులు, డీఇ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













