శ్రీసిటీ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీసిటీ ఆరూరు నర్సరీ వద్ద గల శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం విష్ణు సహస్ర పారాయణం పూజను వైభవంగా నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగుల క్షేమంతో పాటు శ్రీసిటీ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షతో తలపెట్టిన ఈ పూజ నాలుగు రోజుల పాటు జరుగనుంది.
మొదటి రోజు గణపతి పూజ, పుణ్యగావచనం, రుత్విక్వరణం, ప్రధాన కలశ స్థాపన, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం అనంతరం విష్ణు సహస్ర పారాయణ పూజలాచరించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తో పాటు పలువురు శ్రీసిటీ ఉద్యోగులు, పరిసర గ్రామాల ప్రజలు పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. పూజల్లో భాగంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.













