దానిపై ఎవరు మాట్లాడినా ఫలితం ఉండదు : కన్నా
ప్రస్తుతం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా మారిందని, దానిపై ఎవరు మాట్లాడినా ఫలితం ఉండదని… ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేక హోదాపై ప్రకటనేమీ చేయరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం బీజేపీపై తీవ్ర విమర్శలు చేసి దుష్ప్రచారానికి పాల్పడిందని, దాని ఫలితంగానే పరాజయం పాలైందన్నారు. ఈ నెల 9న తిరుపతికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.













