‘ఎయిమ్స్’కు శంకుస్థాపన
ఆలిండియా ఇన్స్టిట్యూన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కోసం రూ.6 కోట్లతో తాత్కాలిక పరిపాలన భవనం, తరగతి గదులను ప్రభుత్వం నిర్మిస్తోందని, వైద్య విద్యార్థుల కోసం చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిర్మించదలచిన ఎయిమ్స్ తాత్కాలిక భవనాలకు కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ కళాశాలల్లో సిద్ధార్థ మెడికల్ కాలేజీ ది బెస్ట్‌గా గుర్తింపు పొందిందన్నారు. జన్మభూమి స్ఫూర్తితో రూ.10లక్షల వ్యయంతో వైద్య విద్యార్థుల కోసం అత్యాధునిక జిమ్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులను అభినందించారు. త్వరలో సిద్థార్థ ఎయిమ్స్ తరగతులను ప్రారంభిస్తామని కామినేని చెప్పారు.













