Ayyanna Patrudu : రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదు : అయన్నపాత్రుడు
అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ (Governor) ప్రసంగం సమయంలో వైసీపీ (YCP) సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరచి ప్రవర్తించారని జగన్ (Jagan) ను ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యుల తీరును నియంత్రించాల్సింది పోయి కూర్చుని నవ్వుకుంటారా? అని నిలదీశారు. బొత్స (Botsa) వంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పలేదని ఆక్షేపించారు. రానున్న రోజుల్లో ఇలాంటివి జరగడానికి వీల్లేదని, ఇకనైనా జగన్ విజ్ఞతతో వ్యవహరించాలన్నారు.













