తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
నవంబర్ 14న తిరుపతిలో జరిగే 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, ముఖ్మమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు హాజరవుతారని సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం, వివిధ అంశాలలపై చర్చిస్తారు అని తెలిపారు. ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, సమాచార కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, అదనపు డీజీపీ రవిశంకర్, టీటీడీ ఈవో డాక్టరు కేఎస్ జవహర్‌రెడ్డి తదితరులు తమ శాఖల పరంగా చేస్తున్న ఏర్పాట్లును వివరించారు.













