రాజధాని రైతుల కోసమే.. అమరావతి చుట్టూ
అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతులకు అండగా ఉంటామని అన్నారు. అందుకోసమే రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాజధాని ఎవరైతే కట్టుకోలేదో వాళ్లదే పాపమన్నారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న విజయవాడలో బహిరంగ సభ జరుగుతుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో విషయంలో బాగా చర్చ జరుగుతుందని అన్నారు. నిజ నిర్ధారణపై గట్టి ప్రయత్నం జరుగుతోందని, ఏం జరుగుతుందో చుద్దామన్నారు.













