హిందూత్వ పై తెదేపానా మాట్లాడేది? సోమువీర్రాజు
కృష్ణా పుష్కరాల సందర్భంగా పలు దేవాలయాలను టీడీపీ ప్రభుత్వం నేలమట్టం చేసిందని, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకురాలేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిందూత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ మాట్లాడే హక్కు తెదేపాకు లేదన్నారు కృష్ణా వుష్కరాలలో 17 రకాల దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం నేలమట్టం చేసిందని గుర్తు చేశారు.
ఆ సమయంలో విజయవాడ గోశాల ప్రాంతాన్ని తాము సందర్శించినవుడు తమపై బుద్దా వెంకన్న దాడికి ప్రయత్నించలేదా? అని నిలదీశారు. ఆలయాలెన్నో కూల్చేసిన చంద్రబాబు.. అధికారంలో ఉన్న ఐదేళ్ల లో ఒక్క ఆలయాన్ని అయినా కట్టారా అని ప్రశ్నించారు. కృష్ణా వుష్కరాలలో ఆలయాలు కూల్చేసినవుడు చినరాజప్ప ఎక్కడున్నారు?. ఆ రోజు మాట్లాడని ఈ రాజప్ప ఇవుడు అంతర్వేది ఘటనపై ఎలామాట్లాడతారు. అంటూ సోము వీర్రాజు విమర్శించారు.













