తొలి సంవత్సరం ఏలా ఇచ్చారో.. అలాగే ఈ ఏడాది
అమ్మవడి తొలి సంవత్సరం ఏలా ఇచ్చారో అలాగే ఈ ఏడాది ఇవ్వాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. వైసీపీ తీసుకునే తుగ్లక్ చర్యలను అడ్డుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు ఆలయాల నిధులు ఇస్తే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమ్మవడి గత సంవత్సరం ఇవ్వలేదు. ఈ సంవత్సరం జూన్ లో ఇస్తామని చెప్పారన్నారు. జిల్లాల విభజన పూర్తి కాగానే నిబంధనలు ప్రకటించారని చెప్పారు. 300 యూనిట్లు విద్యుత్ ప్రామాణీకం పెడితే ఎలా అని ప్రశ్నించారు. ఆధార్ లో కొత్త జిల్లాల నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారు. ఈ కారణంగా 60 శాతం మందికి అమ్మవడి రాదన్నారు. జిల్లాల విస్తరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు, ఆర్థిక బడ్జెట్ హిందూ దేవాలయాలు నుంచి సేకరించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.













