అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ మద్దతు…అవసరమైన సందర్భంలో
అవసరమైన సందర్భంలో అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తోన్న రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు. తిరుపతిలో కేంద్ర హోమంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన సంతృప్తికంగా ముగిసిందన్నారు. 2024లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై మాకు దిశానిర్దేశం చేశారు. రాజధానిగా అమరావతి ఉండాలన్న ఉద్దేశంతోనే కేంద్రం అనంతపురం నుంచి అమరావతి వరకు రహరాది నిర్మిస్తోంది. కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి, కృష్ణా జిల్లాలో 2 రక్షణ సంస్థల ప్రారంభానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. నేచర్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్రం స్పందించడం లేదన్నారు.













