Somireddy : సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయవంతం : సోమిరెడ్డి
టీడీపీపై విమర్శలు చేయడమే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) పనిగా పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Chandramohan Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో సాగరమాల నేషనల్ హైవే (Sagarmala National Highway) పనులు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిపారు. కాకాణి భూ దోపిడీని త్వరలో ఆధారాలతో బయటపెడతానని తెలిపారు. కోర్టు తీర్పును పట్టించుకోని ఆయన బెయిల్ రద్దు చేయాలన్నారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) పై ఆరోపణలు చేసే అర్హత కాకాణికి లేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు రూ.3 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను ప్రజలు విజయవంతం చేశారన్నారు.







