Somireddy: జగన్‌కు ఆ అర్హత లేదు : సోమిరెడ్డి
గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) విమర్శించారు. నెల్లూరులోని రైల్వే కోర్టు (Railway Court) కు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధం లేని కేసులో నిందితుడిగా కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. రూ.43వేల కోట్ల ఆక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) ను అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్లు సంపాదించి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వెన్నుపోటు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్‌కు లేదు. కానిస్టేబుల్ (Constable)ను చంపబోయిన రౌడీషీటర్‌ను ఆయన పరామర్శించారు. జూన్ 4న రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చింది, ప్రజాస్వామ్యం బతికిన రోజు అని సోమిరెడ్డి పేర్కొన్నారు.













