ఆ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలి : సోమిరెడ్డి
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల సభ్యత్వాలను అవసరమైతే చట్ట సవరణ చేసైనా రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సభలో ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఓ విద్యార్థి కొన్ని రోజులు పాఠశాలకు వెళ్లకపోతే ఉపాధ్యాయులు మందలిస్తారు. కనీసం పరీక్షలకు కూడా రాకపోతే డిబార్ చేస్తారు. అసెంబ్లీకి మేం రాం అని సభ్యులు చెప్పిన తర్వాత వారిపై ఏదో ఒక చర్య తీసుకోవాలని అని కోరారు.













