135 సీట్లతో కూటమి అధిరాకంలోకి : సోమిరెడ్డి
ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. జూన్ 4 తర్వాత టీడీపీ నేతలను తరిమేస్తామంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు వారి సంగతి చూసుకోవాలని హితవు పలికారు. జగన్కు ఆయన తల్లి, ఇద్దరు చెలెళ్లు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరిగాయన్నారు.













