అలాంటి మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా?: సోమిరెడ్డి
గౌతు శిరీషా అంటే ఎవరు? స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు, గౌతు శివాజీ కుమార్తె. అలాంటి మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఇంతగా అవమానిస్తారా? అని నిలదీశారు. గౌరవప్రద కుటుంబం ఆడపడుచైన శిరీషకు వెంటనే ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే మీకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గడప గడపకూ ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ వెళుతున్న మిమ్మల్ని మహిళలు చెక్కతో కొడుతుండటంతో దిక్కుతోచక ఇలా కక్ష సాధింపులకు పాల్పడతారా?అని ప్రశ్నించారు.













