అప్పుడు యూపీఏ…ఇప్పుడు ఎన్డీఏ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో అప్పుడు యూపీఏ, ఇప్పుడు ఎన్డీఏ మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా యూపీఏ అయిదేళ్లంటే కాదు, పదేల్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డిన ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని సోమిరెడ్డి ఆరోపించారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వాల్సి అవసరం లేదని చెప్పిందని పేర్కొనడం విడ్డూరమని ఆరోపించారు. దేశాన్ని మోదీ పాలిస్తున్నారా లేక 14వ ఆర్థిక సంఘం పాలిస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.













