దేశంలో ఏపీ మూడవ స్థానంలో : సోమిరెడ్డి
దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకోలేక అల్లాడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లలో ఫిడేలు వాయించుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఒక్క పంటలో కోటి టన్నులు సేకరించారని, కేసీఆర్ మగాడని కొనియాడారు. ఏపీలో ముప్పై శాతం కూడా కొనుగోళ్లు జరగడం లేదని, ఆరు నెలలు గడిచిన డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రధాని మోదిని ప్రశ్నించే దమ్ము ఏపీలో లేకుండా పోయిందని అన్నారు.













