సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…టీడీపీ నేతలతో పాటు అధికారుల
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలతో పాటు కొందరి అధికారుల ఫోన్లలను వైసీపీ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఓ సాఫ్ట్వేర్ ద్వారా ట్యాపింగ్ చేస్తోందన్నారు. చంద్రబాబు పెగాసెన్ కొనుగోలు చేశారన్నది అబద్ధం. పెగాసెన్ను ప్రభుత్వం కొనే అకాశమే లేదు. కేంద్ర అనుమతి లేకుండా అలాంటి సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం కొనలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆర్టీఐ దరఖాస్తుకు సవాంగ్ సృష్టమైన సమాధానమిచ్చారు. పెగాసెస్‌పై మమతా బెనర్జీకి అవగాహన లేకపోవచ్చు. టీడీపీ హయాంలో పెగాసెస్ కొనుగోలు చేసుంటే వివేకా హత్య జరిగేది కాదన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను పీకే డ్యామేజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకున్నారు. కోడికత్తి, వివేకా హత్య విషయంలో టీడీపీపై ఆరోపణలు పీకే వ్యూహాలే అన్నారు. మమత, జగన్‌కు పీకేలే స్ట్రాటజీలు రూపొందిస్తున్నారు అని తెలిపారు.













