లేని సమస్య సృష్టించి.. తానే పరిష్కరిస్తున్నట్లు నాటకాలు : సోమిరెడ్డి
తెలుగు సినీ ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవమానించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నానని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నమస్కారం చేసిన అగ్ర హీరోలకు ప్రతినమస్కారం పెట్టాలనే సంస్కారం సీఎం జగన్‌కు లేకుండా పోయిందని విమర్శించారు. సినీ పరిశ్రమకు లేని సమస్య సృష్టించి పరిష్కరిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారన్నారు. సినీ పరిశ్రమ జోలికి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పోలేదన్నారు. మరోవైపు అఖిలభారత సర్వీసు అధికారులనూ సీఎం దారుణంగా అవమానించారని ధ్వజమెత్తారు. సీఎంకు సలామ్ కొడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన గౌతమ్ సవాంగ్‌ను గంటలో పీకేశారన్నారు. పోలీస్ ప్రతిష్టను కొత్త డీజీపీ కొంతైనా కాపాడతారేమో వేచి చూడాలని అన్నారు.













