ఏపీలో బాధితులను.. ముద్దాయిలుగా మారుస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధితులను ముద్దాయిలుగా మార్చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన ఆధారాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. డాది చేసిన నిందితుల ఫొటోలను, ఓ డీఎస్పీ దగ్గరుండి నిందితులను సాగనంపారంటూ వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజలపై హింసను పోలీసులే ప్రోత్సహిస్తూ బాధితులను ముద్దాయిలుగా మారుస్తున్నారు. ప్రశాంతంగా బంద్‌కు పిలుపునిస్తే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే బాధేస్తోంది అన్నారు. మా ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడిన వారిని డీఎస్పీ దగ్గర ఉండి కారెక్కించి పంపారు. దాడులు, అప్పులు తప్ప జగన్‌కు ఏమీ తేలియదన్నారు. రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాలు పెరిగిపోయాయి. అరికట్టాలని అడిగితే దాడులు చేసే పరిస్థితి వచ్చేసింది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థని బిహార్, బెంగాల్ కన్నా దిగజార్చారు. రాష్ట్రం ఎక్కడికి పోతోందో అర్థం కావడం లేదన్నారు.













