మాది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు
రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని, అపద్ధర్మ ప్రభుత్వం కాదని సృష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సజావుగా పాలన అందించాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదని అన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే అన్నారు. ఇటీవల అకాలవర్షం, వడగాళ్ల వానతో ఆత్మకూరు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకుంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు కలెక్టర్, అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు.













