ఆ ముగ్గురు ప్రేమలో పడ్డారు
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా, రైతులపై భాష్ప గోళాలతో దాడులు చేస్తున్నా జగన్, పవన్, కన్నా లక్ష్మీనారాయణ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముగ్గురు ప్రేమలో పడ్డారని అందుకే, కేంద్రం తీరుపై పల్లెత్తు మాటయినా అనడం లేదని వ్యాఖ్యానించారు. వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టడమే పనిగా ఉందన్నారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి 30 సీట్ల కంటే ఎక్కువ రానియ్యమని సోమువీర్రాజు అంటున్నారు. టీడీపీని అధికారంలోకి రానియ్యమని పవన్ మాట్లాడుతున్నారు. మరి ఎవరిని అధికారంలోకి తీసుకురావడానికి వీళ్లు ప్రయత్నిస్తున్నారు. ఒక ముద్దాయిని అధికారంలోకి తేవాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.













