ఏపీని బ్లాక్ లిస్ట్‌లో పెడితే.. అభివృద్ధి ఎలా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హయాంలో మహిళలకు స్వేచ్ఛ ఉండేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సింహపురి స్త్రీ శక్తి చర్చావేదికలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికీ మరుగుదొడి నిర్మించామని చెప్పారు. మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్, ఆ మాటే మర్చిపోయారని మండిపడ్డారు. జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీని బ్యాంకులు బ్లాక్ లిస్ట్‌లో పెడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వలో మహిళలు అవమానాలకు గురవుతున్నారు. మహిళలు జాగృతమైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ఇసుక నిర్వహణను డ్వాక్రా మహిళలు చక్కగా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతోంది. 2024లో జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలి అని పిలుపునిచ్చారు.













