నవ నిర్మాణ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం
తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవ నిర్మాణ దీక్ష రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు రాజీనామాలు అంటున్న వైసీపీ ఎంపీలు నాలుగేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ జీవితమంతా సానుభూతిపైనే బతకాలనే చూస్తున్నారని అన్నారు. జగన్ పార్టీకి ఎన్నికలంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ నేతలు విలువలకు పాతరేశారని అన్నారు. ప్రజలకు చేసిన అభివృద్ది, అమలు చేసిన పథకాలను చెప్పుకుని ధైర్యంగా ఓట్లు అడుగుతమన్నారు.













