మీరు సీఐడీ అధికారులా.. లేక వైసీపీ ప్రతినిధులా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో సీఐడీ అధికారుల తీరుపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మీరు సీఐడీ విచారణ అధికారులా లేక వైసీపీ అధికార ప్రతినిధులా? అని ప్రశ్నించారు. విజయవాడలో 2 సార్లు, హైదరాబాద్లో ఒకసారి, ఢిల్లీలో మరోసారి ప్రెస్మీట్లు ఎలా పెడుతారని నిలదీశారు. కోర్టుల్లో చెప్పకుండా ప్రెస్మీట్లు పెట్టి చెప్పదలచుకున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ హయాంలో ఇలా చేసిన అధికారులకు ఏ గతి పట్టిందో గుర్తు పెట్టుకోవాలన్నారు.













