తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత
సూర్య గ్రహణం కారణంగా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 గంటల మూసివేయగా, రాత్రి 7:30 గంటలకు తిరిగి తెరవనున్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేఊసింది. ఆలయ సంప్రోక్షన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. విజవాయడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయాలను మూసివేశారు. టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు చాలా చోట్ల ఇతర ఆలయాలు కూడా మూసివేశారు.
తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని మంగళవారం ఉదయం 8:50 నుంచి మూసివేసి బుధవారం ఉదయం 8 గంటలకు తెరుస్తారు. నేడు జరిగే నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవంతో పాటు బుధవారం జరిగే శత ఘటాభిషేకం, సహస్ర నామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. రేపు ఉదయం 10:30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భద్రాచాలం రామాలయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేస్తారు. వరంగల్ భద్రకాళి ఆలయం, హనుమకొండ వేయి స్తంభాల గుడిని మూసివేశారు.













