చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. ఫిబ్రవరి 9వ తేదీకి విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఫిబ్రవరి 9న తనకు మరో పని ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టు తెలిపారు. అయితే ఫిబ్రవరి 12కు వాయిదా వేయాలని హరీశ్ సాల్వే విజ్ఞప్తి చేయడంతో ధర్మాసనం అంగీకరించింది.













