Narayana Swamy: లిక్కర్ కేసు, మాజీ మంత్రి అరెస్ట్..?
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయా అని వైసిపి కార్యకర్తలు కాస్త ఆందోళనలో ఉన్నారు. మిథున్ రెడ్డి(Mithun Reddy)ని అరెస్టు చేసిన తర్వాత ఎవరినైనా అరెస్టు చేయవచ్చు అనే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా పక్క ఆధారాలతో ఆస్తులు కూడా జప్తు చేస్తూ వస్తుంది. తాజాగా రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో అధికారులు జప్తు చేశారు. మిగిలిన ఆస్తులను కూడా త్వరలోనే జప్తు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇక ఇది పక్కన పెడితే ఈ కేసులో మరో అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణం జరిగిన సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామిని అరెస్టు చేయవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి కూడా చేరుకుంది. ఆయన ఇంటికి వెళ్లి విచారణ చేసింది. ఇప్పటికే ఆయన అరెస్టుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. అయితే నారాయణస్వామి పక్కా సమాచారం దర్యాప్తు అధికారులకు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
దాని ఆధారంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి నారాయణస్వామి కి మధ్య కాస్త విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలతోనే లిక్కర్ కుంభకోణంలో ఆధారాలను దర్యాప్తు బృందానికి నారాయణస్వామి ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తన ప్రమేయం లేకుండా ఈ కుంభకోణం జరిగిందని ఆయన అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సాక్షిగా విచారణకు పిలిచినా ఆయన వెళ్ళలేదు. అయితే కొన్ని కీలక ఒప్పందాలపై ఆయన ప్రమేయం ఉండటంతో దర్యాప్తు అధికారులు ఆయనను అరెస్టు చేయడం తప్పడం లేదని పోలీసు వర్గాలు అంటున్నాయి.
ఇదే వ్యవహారంలో కొంతమంది ప్రభుత్వాలు ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖలో కీలక అధికారులు అప్పుడు మద్యం కుంభకోణంలో భాగస్వాములు అయ్యారని, దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందులో ఒక కీలక అధికారి కూడా ఉన్నట్లు సమాచారం.







