Narayana Swamy : వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం : మాజీ మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కె. నారాయణ స్వామి (Narayana Swamy )ని పుత్తూరు లోని ఆయన నివాసంలో సిట్ (SIT) అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. వైసీపీ (YCP) హయాంలో మద్యం పాలసీలో మార్పులు, మద్యం ఆర్డర్స్‌లో ఆన్‌లైన్ (Online) విధానం తీసేసి మాన్యువల్ తేవడంపైనా ప్రధానంగా విచారించినట్టు సమాచారం. సిట్ విచారణ అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ సిట్ అధికారులు నాలుగు ప్రశ్నలు (Questions) అడిగారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చాను. సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని తెలిపాను.