ఏపీలో సింగిల్‌విండో బెస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల అనుమతుల కోసం ప్రవేశపెట్టిన సింగిల్‌విండో విధానం ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. 41శాతం మంది పారిశ్రామికవేత్తలు ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నల్లు నీతి ఆయోగ్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. దీని తర్వాత స్థానంలో రాజస్థాన్ 33 శాతం, గుజారాత్ 32 శాతం ఉన్నాయి.
దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చాలా రాష్ట్రాల్లో 20 నుంచి 120 రోజుల సమయం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో 240 రోజులు కూడా తీసుకుంటోంది. సగటున చూస్తే 118 రోజులుపడుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. తమిళనాడులో ఏదైనా పరిశ్రమ ఏర్పాటుకు సగటున 63రోజుల సమయం తీసుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 67 రోజులు పడుతోంది. అత్యధిక పెట్టుబడులతో కూడిన స్టార్టప్‌లు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వస్తున్నాయి. ఇక్కడున్న సులభ వాణిజ్య విధానం అందుకు దోహదం చేస్తోంది. మిగతా రాష్ట్రాల్లో స్టార్టర్స్ ఏర్పాటుకు సగటున 113 రోజుల సమయం పడుతుండగా, ఇక్కడ మాత్రం 85 రోజుల్లో పూర్తవుతోంది. కార్మికుల అవసరం అధికంగా ఉన్న పరిశ్రమలు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ పైనే అధికంగా దృష్టిసారించాయి.













